అధికారదాహం, ఖాన్ సార్ సింహాసనం కోరికకు సోదరభావం పవిత్ర బంధాలు లొంగి పోతాయా? అనేది ఎలా ఉంటుందో చూపించేందుకు ప్రభాస్, పథ్వీరాజ్ నటించిన ‘సాలార్: పార్ట్ 1 సీజ్ ఫైర్’ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈనెల 16 నుండి హిందీలో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ నీల్ రచించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
సలార్: పార్ట్ 1- సీజ్ ఫైర్‌లో దేవగా నటించిన ప్రభాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘ఈ చిత్ర విజయాన్ని వేడుక చేసుకుంటూ కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడం నాకు చాలా థ్రిల్‌గా ఉంది. ఈ చిత్రాన్ని నిర్మించే ప్రయాణం అద్భుతమైనది. అది మాకు భావోద్వేగభరిత రోలర్ కోస్టర్. ఈ చిత్రం ఇప్పుడు హిందీలో డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో వస్తోంది. ఈ కథను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉత్తర, మధ్య భారతదేశంలోని నా అభిమానులు హిందీలో ఈ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడు అవుతుందో తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో దూసుకుపోతున్నారు. వారందరి కోసం ఈనెల 16 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో సినిమా చూడండి అని అన్నారు.
‘ఇందులో నాకు అవకాశం వచ్చినప్పుడు నేను తిరస్కరించలేకపోయిన స్క్రిప్ట్. అలా ఎందుకు తిరస్కరించలేకపోయాను అనేది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో సినిమాను చూసినప్పుడు తెలుస్తుంది. ఇది అద్భుతమైన తారాగణం, అద్భుతమైన దర్శకత్వం, సినిమాటోగ్రఫీతో పూర్తి చేసిన స్క్రిప్ట్’ అని వర్ధ పాత్రను పోషించిన పథ్వీరాజ్ తెలిపారు.
దర్శకుడు, రచయిత ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ, ‘పవర్ ప్యాక్డ్ యాక్షన్, ఇంపాక్ట్ ఫుల్ మ్యూజిక్‌తో నిండిన తిరుగుబాటు కథనాలకు నేను ఎప్పుడూ అభిమానిని. ఇది మీరు కనెక్ట్ అయ్యే కథ’ అని చెప్పారు.