వేతన జీవులకు కోతలే తప్ప లాభం లేదు

– మదుపు చేసుకునే అవకాశం ఇవ్వాలి
– జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ.ఖాద్రీ
నవతెలంగాణ శంకరపట్నం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వేతన జీవులకు కోతలే తప్ప లాభం లేదని, మదుపు చేసుకునే అవకాశం ఇవ్వాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఎం.ఏ.ఖాద్రీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఖాద్రీ మాట్లాడుతూ,గత కొన్నేళ్లుగా ఆదాయపు పన్ను పరిమితి విషయంలో ఆశించినంత ఊరట లభించికపోవడం,పన్ను వర్తించే ఆదాయం పరిమితిని పెంచుతూ శ్లాబులను సవరించాలని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు  ఒక నెల జీతం కంటే ఎక్కువ ఐ టీ రూపంలో చెల్లిస్తూ అంకెల గారడీ బడ్జెట్ తో ఆవేదనతో బాధపడుతున్నారని, గరిష్ట పన్ను శ్లాబు శాతమును తక్కువ శాతానికి సవరించాలని ఆయన డిమాండ్ చేశారు.పన్ను భారం తగ్గించుకునేందుకు ఉన్న ప్రధాన సెక్ష‌న్ 80 సీ ఇది 2014 నుంచి 1.50,000 రూ.లకు ఉందని దీన్ని 5 లక్షలకు పెంచాలన్నారు. వివిధ రకాల పథకాల్లో ఇపిఎఫ్, పీపీఎఫ్ , జీపీఎఫ్, టీ ఎస్ జీఎల్లై, జీవిత భీమా,ఇంటిరుణం అసలు, ఎఫ్ డీలు, పిల్లల ట్యూషన్ ఫీజులు ఇలా ఎన్నో మదుపు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కేవలం 1.50,000 రూ.లకే పరిమితితో ఉన్న నిబంధన సరికాదని, 2014 లెక్కలో చూస్తే ఇది సరిపోయింది, ఇప్పుడు కనీసం 5 లక్షలకైనా  పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు.