సలాసర్‌ టెక్నో కొత్త జింక్‌ గాల్వనైజేషన్‌ ప్లాంట్‌ ఏర్పాటు

హైదరాబాద్‌ : ఇంజినీరింగ్‌, డిజైనింగ్‌ కంపెనీ సలాసర్‌ టెక్నో ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌ 96వేల మెట్రిక్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో కొత్త జింక్‌ గాల్వనైజేషన్‌ ప్లాంట్‌ను విజయవంతంగా ఇన్‌స్టాల్‌ చేసినట్టు తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని దౌలానాలో దీన్ని ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ”మా కొత్త జింక్‌ గాల్వనైజేషన్‌ ప్లాంట్‌ని విజయవంతంగా ఇన్‌స్టాల్‌ చేయడం మా ఆవిష్కరణల నిబద్ధతకు నిదర్శనం. గాల్వనైజ్డ్‌ ఉత్పత్తుల కోసం ఎప్పటికప్పుడు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చగల శక్తి ఉంది.” అని సలాసర్‌ టెక్నో ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.