– సబ్ రిజిస్టర్ కు ఫిర్యాదు చేసిన నాయకులు
నవతెలంగాణ -హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణంలో నిబంధనలకు విరుద్దంగా స్టాంప్ పేపర్లు అమ్మకాలు జరుగుతున్నాయని గురువారం హుస్నాబాద్ సబ్ రిజిస్టర్ కు వివిధ పార్టీల నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హుస్నాబాద్ లో పదిమంది స్టాంప్ వెండర్లు రూ.20, 50, 100 రూపాయలు, రూ.500 రూపాయల,10 రూపాయల టికెట్లను రూ. 30 రూపాయల అధిక ధరలతో ఇష్టా రాజ్యంగా వసూలు చేస్తున్నారని అన్నారు. ఈ విషయాన్ని సబ్ రిజిస్ర్టార్ దృష్టికి తీసుకు వెళ్ళినప్పటికీ అధిక ధరలకే అమ్ముతున్నారని అన్నారు. ధరల విషయమై విచారణ జరిపి స్టాంప్ వెండర్లపై తగు చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో బీ ఎస్ పి నాయకులు ఎలగందుల శంకర్, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్, బీఎస్పీ హుస్నాబాద్ మండల అధ్యక్షులు వేల్పుల రాజు,శరత్ తదితరులు పాల్గొన్నారు.