రైతులకు విక్రయ రసీదు తప్పనిసరి అందించాలి: రవీందర్

Sale receipt must be provided to farmers: Ravinderనవతెలంగాణ – తాంసి
రైతులు కొనుగోలు చేసిన ఎరువులకు క్రిమిసంహార మందులకు సంబంధించిన బిల్లులను కొనుగోలుదారుకు తప్పకుండా బిల్లు ఇవ్వాలని మండల వ్యవసాయ అధికారి రవీందర్  తెలిపారు. సోమవారం మండలంలోని బండల్ నాగాపూర్ గ్రామంలో రైతు ఆగ్రో సేవా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాలు స్టాక్ రిజిస్టర్లు ఇతర రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎవో మాట్లాడుతూ విత్తనాలు ఎరువులు  మందులను ప్రభుత్వం ప్రకటించిన  ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువగా ఎవరు విక్రయించిన రైతులు వెంటనే మా అధికారులకు సమాచారం అందించాలని, రైతులు ఫిర్యాదు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్టాక్ బోర్డులు ఏర్పాటు చేసి ధరలను బోర్డుపై రాయాలన్నా రు. డీలర్లు ఉద్దేశపూర్వకంగా ఎరువులను బ్లాక్ మార్కెట్ సృష్టించిన అధిక ధరలకు విక్రయించిన చర్యలు తీసుకొని లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుంది అని హెచ్చరించారు. దుకాణాలలో స్టాక్ రిజిస్టర్లు ఇతర రికార్డులను వ్యవసాయ అధికారి సిబ్బందితో కలిసి పరిశీలించారు.