పేజాప్‌కు సెలెంట్‌ మోడల్‌ బ్యాంక్‌ అవార్డు

ముంబయి: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తన మొబైల్‌ యాప్‌ పేజాప్‌ సెలెంట్‌ మోడల్‌ బ్యాంక్‌ అవార్డును అందుకున్నట్లు తెలిపింది. పేమెంట్‌ ఇన్నోవేషన్‌ కేటగిరీలలో ఈ గుర్తింపును దక్కించుకున్నట్లు పేర్కొంది. బ్యాంకింగ్‌లో సాంకేతికత వినియోగంలో అత్యుత్తమ అభ్యాసాలను గుర్తించి, ప్రోత్సహించేందుకు సెలెంట్‌ వార్షిక మోడల్‌ బ్యాంక్‌ అవార్డులను అందిస్తుంది. ప్రపంచంలోని 36 దేశాల నుంచి 140 పైగా నామినేషన్ల రాగా, 19 విజేతలలో పేజాప్‌ ఒకటిగా నిలిచిందనిహెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ రవి సంతానం తెలిపారు.