సలీమకు కెప్టెన్సీ పగ్గాలు

Salima has the reins of captaincy– భారత మహిళల హాకీ జట్టు ఎంపిక
న్యూఢిల్లీ : భారత స్టార్‌ మిడ్‌ఫీల్డర సలీమ టెటె మహిళల హాకీ జట్టుకు సారథ్యం వహించనుంది. 2024 ఆసియా మహిళల హాకీ చాంపియన్స్‌ ట్రోఫీ నవంబర్‌ 11-20 వరకు బిహార్‌లోని రాజ్‌గిర్‌ వేదికగా జరుగనుంది. భారత్‌ సహా చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, మలేషియా, థారులాండ్‌ జట్లు ఈ టోర్నీలో పోటీపడనున్నాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత జట్టుకు సలీమ కెప్టెన్‌గా ఎంపిక కాగా.. నవనీత్‌ కౌర్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఈ మేరకు భారత హాకీ సమాఖ్య సోమవారం మహిళల జట్టును ప్రకటించింది. 2016 తర్వాత 2023 ఫైనల్లో జపాన్‌ను ఓడించి రెండోసారి విజేతగా నిలిచిన టీమ్‌ ఇండియా.. మూడో టైటిల్‌పై కన్నేసి బరిలోకి దిగనుంది. తొలి మ్యాచ్‌లో మలేషియాతో తలపడనున్న భారత్‌.. వరుసగా దక్షిణ కొరియా, థారులాండ్‌, చైనా, జపాన్‌లను ఢకొీట్టనుంది. భారత మహిళల హాకీ జట్టు : సవిత, బిచూ దేవి (గోల్‌ కీపర్లు). ఉదిత, జ్యోతి, వైష్టవి, సుశీల చాను, ఇశిక చౌదరి (డిఫెండర్లు). నేహా, సలీమ (కెప్టెన్‌), షర్మిలా దేవి, మనీశ చౌహాన్‌,సునెలిట, లాల్‌రెమిసియామి (మిడ్‌ ఫీల్డర్లు). నవనీత్‌ కౌర్‌ (వైస్‌ కెప్టెన్‌), ప్రీతి దూబె, సంగీత కుమారి, దీపిక, బ్యూటీ (ఫార్వర్డ్స్‌).