నవతెలంగాణ – పెద్దవూర
యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా సల్ల హనుమంతు రెడ్డి ని మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి ఆధ్వర్యంలో పెద్దవూర లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, బ్లాక్ అధ్యక్షుడు తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి గారి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు జానారెడ్డి పిలుపుమేరకు క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలలో తనదైన పాత్రను నిర్వహిస్థామని తెలిపారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గౌని రాజా రమేష్ యాదవ్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు పగడాల నాగరాజ్ యాదవ్, సాగర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తుమ్మలపల్లి రంగారెడ్డి, ఎస్టీ సెల్ నియోజవర్గ అధ్యక్షుడు పాండు నాయక్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ముని నాయక్, సుధాకర్ రెడ్డి ,నల్లగొండ గిరిబాబు, శశి పాల్ రెడ్డి, దండు బిక్షం, తిరుమల యాదవ్, అరుణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.