సిద్స్‌ ఫార్మ్‌ నుంచి సాల్టెడ్‌ బటర్‌ శ్రేణీ

హైదరాబాద్‌: తెలంగాణకు చెందిన ప్రీమియం డి2సి డెయిరీ బ్రాండ్‌ అయిన సిద్స్‌ ఫార్మ్‌ కొత్తగా సాల్టెడ్‌ బటర్‌ శ్రేణీని ఆవిష్కరించినట్టు ప్రకటిం చింది. ఈ ఉత్పాదనను తొలుత హైదరాబాద్‌, బెంగళూరు మార్కెట్‌లో అం దుబాటులోకి తెచ్చినట్టు మంగళవారం తెలిపింది. ఆవు, గేదేలకు చెందిన ఈ కొత్త వెన్న శ్రేణీని నేరుగా వినియోగదారులకు పంపిణీ చేయనున్నట్టు పే ర్కొంది. ఇది 100 గ్రాముల బాక్స్‌లో లభిస్తుందని, దీని ధర రూ.100గా నిర్ణయించామని సిద్స్‌ ఫార్మ్‌ వ్యవస్థాపకులు కిషోర్‌ ఇందుకూరి తెలిపారు.