నవతెలంగాణ – ఆర్మూర్
రాష్ట స్థాయి బాల సాహిత్య సమ్మేళనానికి సమన్వయ కర్తగా వ్యవహరించి తన వ్యాఖ్యానంతో , చలోక్తులతో అలరించిన నాగరాజు కు తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి , ప్రధాన కార్యదర్శి డాక్టర్ చెన్నప్ప లు గురువారం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లలిత కళా పరిచయం చేసిన వివిధ రంగాల్లో ప్రఖ్యాతి సాధించిన కళాకారులు లలిత కళలు విద్యార్థులకు మనో విజ్ఞాన,వికాసాలను అందిస్తాయని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బాల సాహిత్య పరిషత్ అధ్యక్షులు కాసర్ల నరేష్ , కార్యదర్శి ప్రవీణ్ శర్మ , చింతల శ్రీనివాస్, శారద హన్మాండ్లు నాగరాజు ను అభినందించారు.