– సుమారు నాలుగు కోట్ల ప్రత్యేక నిధులతో పనులు ప్రారంభం
నవతెలంగాణ-కొత్తూరు
కొత్తూరు పట్టణ ప్రధాన రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. వ్యాపారులకు వాహన దారులకు ఊరట లభించనుంది. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విజయం సాధించాక రోడ్డు అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. పలుమార్లు కాంగ్రెస్ మండల నాయకులు రోడ్డు దుస్థితిపై ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ప్రత్యేక చొరవ తీసుకొని రోడ్డు అభివృద్ధి పనులు తగు కృషి చేశారు. దీంతో బుధవారం స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆర్‌అండ్‌బీఏ ఈ రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ బాలాజీలతో కలిసి రోడ్డు పనులను ప్రారంభించారు. కొత్తూరు వై జంక్షన్ నుంచి పూలే విగ్రహం వరకు ఉన్న 330 ఫీట్లు, 74 ఫీట్ల వెడల్పు ఉన్న 6 ఫీట్ల డివైడర్‌తో నాలుగు లైన్ల సీసీ రోడ్డు నిర్మాణ పనులకు అందుకు సుమారు రూ. నాలుగు కోట్ల ప్రత్యేక నిధులతో పనులు చేస్తామని అధికారులు తెలిపారు.
నిధులు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలోనే మంజూరైనవే…
కొత్తూరు ప్రధాన రోడ్డు పనులకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నే అప్పటి మున్సి పల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపన చేశారనీ, షాద్‌గనర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంజూరైన నిధులతో రోడ్డు పనులు చేస్తూ తామే మంజూరు చేయించామనీ కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారని విమర్శించారు. బుధవారం ఆయన రోడ్డును పరిశీలించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు జాండగూడెం సుదర్శన్ గౌడ్, వీరమోని దేవేందర్ ముదిరాజ్, కర్రోల్ల సురేందర్, ఇందూరి శ్రీనివాస్, నవీన్‌చారి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిం దన్నారు. బీఆర్‌ఎస్ నాయకుల నిర్లక్ష్యంతో మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పడకేసిందని ఆరోపించారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చొరవతోనే రోడ్డు నిర్మాణ పనులు నిర్వహిస్తుంటే, బీఆర్‌ఎస్ నాయకులు తమ నిధు లేనని చెప్పుకోవడం హస్యస్పదంగా ఉందన్నారు. ఈ సందర్భంగా రోడ్డు పనులకు సహకరించిన ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కమ్మరి జనార్ధన్ చారి, తీగపూర్ ఆంజనేయులు, గోవిందు నాయక్ ఉన్నారు.