సొంత భవనానికి మోక్షమెప్పుడో .?

– సొంత భవనం లేక..సమావేశం నిర్వహణ గగనం
నవతెలంగాణ – వీర్నపల్లి  
మహిళలు స్వయం సహాయక సంఘాల్లో చేరితే పొదుపు చేయడం అలవాటుగా మారుతుంది. బ్యాంకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. దీనివల్ల మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. ఇదే ఉద్దేశంతో మహిళలు సంఘాల్లో సభ్యులుగా చేరుతున్నారు. మహిళలందరు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేరితే ఆయా కుటుంబాలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది. గ్రామైక్య సంఘాలు, మండల సమాఖ్యలు పొదుపు సంఘాలను సరైన మార్గంలో నడిపించడంలో కీలక పాత్ర పోషిస్థాయి. వీర్నపల్లి మండలంలో 17 గ్రామాల్లో మహిళ స్వశక్తి సంఘాలు 341, గ్రామాలలో మహిళ సంఘాలలో చేరిన సభ్యులు 3944 మంది మహిళలు, గ్రామ సమైక్య సంఘాలు( వివో లు) 18 ,గ్రామాల్లో మహిళ గ్రామైక్య సంఘాలు నెలకు రెండు సమావేశాలు నిర్వహిస్తుంటారు.మండలంలోని 17 గ్రామాలలో గ్రామైక్య సంఘాల భవనాలు కంచర్ల, గర్జన పల్లి, అడవి పదిర మూడు గ్రామాల్లో ఉన్నవి.14 గ్రామాలలో సొంత భవనాలు లేక చెట్ల కింద అద్దె భవనాల్లో గ్రామ పంచాయతి లో సమావేశాలు నిర్వహిస్తుంటారు. వీర్నపల్లి నూతన మండలంగా ఏర్పడి ఏడు ఎండ్లు గడిచిన మండల సమాఖ్య భవనం లేక అద్దె భవనాల్లో సమావేశాలు కార్యాలయం విధులు నిర్వహిస్తున్నారు . ప్రస్తుతం గ్రామ పంచాయతి పాత బిల్డింగ్ లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ( సేర్ఫ్) కార్యాలయం కొనసాగుతుంది . పాత గ్రామ పంచాయతి బిల్డింగ్ కావడంతో ఆకాల వర్షం కు వర్షపు నీరు కార్యాలయంలొకి రావడం తో బురదతో సమావేశాల కు ఇబ్బంది గా మారింది. ఇరుకగా ఉండటంతో సమావేశాలు, కార్యాలయ నిర్వాణ ఒకే గదిలో సమావేశాలు చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామూ సమ్మెక్య సంబంధించిన దస్తవేదులు భద్రపరచడం ఇబ్బందిగా మారింది. సమావేశాలు నిర్వహిస్తే మహిళలకు కనీస వసతులు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. సొంత భవనలకు నిధులు మంజూరు చేసి నిర్మాణం చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని మహిళ సంఘాలు, సభ్యులూ కోరుతున్నారు.
మా సమస్యను పరిష్కరించండి..మండల సమైక్య అధ్యక్షురాలు సంతోష :
సొంత సెర్ఫ్ కార్యాలయం భవనం లేక ఇబ్బందులు పడుతున్నాము ఇప్పుడున్న సేర్ఫ్ భవనంలోకి నీరు చేరి మొత్తం బురద అయ్యింది కనీస వసతులు లేవు మహిళ సంఘాలకు సొంత భావన నిర్మాణానికి అధికారులు స్పందించి నిధులు మంజూరు చేసి మా సమస్యను పరిష్కరించాలని కోరారు.
డీఅర్డిడీవో శేషాద్రి : సమైక్య భవనాలకు ఇంత కు ముందు ఇ జి ఎస్ ద్వారా భవనలు నిర్మించారు. ఇప్పుడు ఆ ఇజియస్ గ్రాంట్ ఉంటే భవనం నిర్మాణంకు నిధులు మంజూరు చేసేలా కృషి చేసి శాశ్వత భవన నిర్మాణం కు మార్గం సుగమం చేస్తాను.