
ఇందల్ వాయి మండలంలోని నల్లవెల్లి సహకార సొసైటీ చైర్మన్, ఐడీసీఎంఎస్ చైర్మన్, మార్కెఫెడ్ రాష్ట్ర డైరెక్టర్గా కొనసాగుతున్న సాంబారి మోహన్ అవిశ్వాస తీర్మానానికి ముందే సోసైటి చైర్మన్ పదవికి రాజీనామాను డిసిఓ ఎన్ శ్రీనివాస్ రావు కు శుక్రవారం అందజేశారు. నల్లవెల్లి సహకార సొసైటీ కార్యాలయం లో రాజినామా పత్రాన్ని సమర్పించిన అనంతరం సాంబార్ మోహన్ మాట్లాడుతూ వ్యక్తిగత కారణాలతోనే సహకార సొసైటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు వివరించారు. ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న తనను అప్పటి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆశీర్వాదం, సహాయ సహకారాలతో సోసైటి ఎన్నికల్లో డైరెక్టర్ గా పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికై సహకార సొసైటీ చైర్మన్ గా, ఉమ్మడి జిల్లాల ఐడీసీఎంఎస్ చైర్మన్ గా, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ గా నిస్వార్థంగా భాద్యతలను స్వీకరించి గత నాలుగేళ్ల రేండు నేలల్లో రైతులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా చర్యలను సహకార సొసైటీ పాలకవర్గం సహాయ సహకారాలతో ఎరువులు,వరి ధాన్యాం,గాన్ని బ్యాగుల కోరత,హమలిల కోరత లేకుండా సోసైటి పరిదిలోని సంస్థాన్ సిర్నపల్లి, నల్లవెల్లి, గౌరరం, డోంకల్, లింగపూర్ తోపాటు గిరిజన తండాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు.
రాష్ట్రం లో వచ్చిన మార్పు కు అనుగుణంగా వ్యక్తి గతంగా, కోందరి ఒత్తిడిలకు, ఇంకోన్ని కారణాల వల్ల చైర్మన్ పదవికి రాజీనామా చేయక తప్పలేదని అవేదన వ్యక్తం చేశారు.పదవి భాద్యతలను స్వీకరించిన నటి నుండి నేటి వరకు ఒక్క రూపాయి అవకతవకలు జరగకుండా పాలన సాగించనని, తన పదవీ కాలం లో తనకు ఏళ్ళ వేలల వేన్నంటి ఉండి సహకారాలు అందజేసిన రైతులకు, పాలకవర్గం సభ్యులకు, అదికారులకు, ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు.నూతన పాలకవర్గం రైతులకు ఇబ్బందులు కలగకుండా చుస్తుందని సాంబార్ మోహన్ అశాభావం వ్యక్తం చేశారు.
ఒక్క ఛైర్మన్ పదవితో..రేండు పదవులకు ఎసరు ..
నల్లవెల్లి సహకార సొసైటీ ఛైర్మన్ గా, ఉమ్మడి జిల్లా ఐడీసీఎంఎస్ చైర్మన్గా, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ గా సాంబారి మోహన్ పై ఈ నేలా 1న అవిశ్వాసానికి 9 మంది డైరెక్టర్లు నోటిసులను డిసిఓ ఎన్ శ్రీనివాస్ రావు కు అందజేశారు.ఈ నేలా 3న చైర్మన్, డైరెక్టర్లకు నోటిసులు జారీ చేశారు. ఎప్రిల్ 19 న11గంటలకు సహకార సొసైటీ లో అవిశ్వాస తీర్మానం పై ప్రత్యేక సమావేశం , చర్చా ఉంటుందని ప్రకటించారు. దానిలో భాగంగానే చైర్మన్ సాంబార్ మోహన్ 10.30 గంటలకు సహకార సొసైటీ చేరుకుని వ్యక్తిగత కారణాలతోనే రాజినామా చేస్తున్నట్లు లేఖా ను అందజేశారు.ఇక అవిశ్వాసం పై ఏలాంటి చర్చా లేకుండా వైస్ చైర్మన్ గా ఉన్న సంస్థాన్ సిర్నపల్లి కి చెందిన డైరెక్టర్ రమేష్ కు తాత్కాలిక చైర్మన్ గా భాద్యతలను అప్పగించారు. అనాడు నల్లవెల్లి సహకార సొసైటీ చైర్మన్ గా ఎన్నికై అనూహ్య పరిణా మాల మధ్య ఐడీసీఎంఎస్ చైర్మన్గా మోహన్ ఎన్నికయి అనతికాలంలోనే మార్ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ గా పదవీ బాధ్య తలు చేపట్టారు. అంతకు ముందు ఈ బాల పరీక్షలో అవిశ్వాసం వీగిపోతుందా? నెగ్గుతుందా? అని ప్రజలు ఎదురు చూశారు. అవిశ్వాసం పైచివరి వరకు తనవంతుగా ప్రయత్నాలు చేసినా ఏలాంటి లాభం లేకపోవడంతో చివరి అరగంట ముందు రాజినామా సమర్పించడంతో సహకర సొసైటీ చైర్మన్ పదవే కాకుండా ఉమ్మడి జిల్లాల ఐడీసీఎంఎస్ చైర్మన్, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ పదవులను సాంబార్ మోహన్ కోల్పోయారు. అధికార పార్టీలోని ఓ కీలక నేత ఈ వ్యవహారం మొత్తం నడిపినట్లు, కాంగ్రెస్ పార్టీ లో చేరడానికి సాంబార్ మోహన్ సిద్ధంగా ఉన్నా చేరిక కు రేడ్ సిగ్నల్ రావడం, కాంగ్రెస్ లో ఇంకోందరు సాంబార్ మోహన్ కు మద్దతుగా చివరి వరకు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆ యన పదవిని కాపాడుకునేందుకు ఇప్పటికే రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరె డ్డిని కలిసినప్పటికి ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. ఐడీసీఎంఎస్ చైర్మన్ గా సాంబారి మోహన్ భాద్యతలను స్వీకరించిన నాడు ఐడీసీఎంఎస్ నష్టాల్లో కురులకు పోయి సిబ్బంది కి వేతనాలు కూడా చేల్లిచే స్థితిలో లేకుండా ఉండేదని, దాన్ని ఓకే సవాల్ గా స్వికరించి ఇప్పుడు ఐడీసీఎంఎస్ ను లాభాల బాటలోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఐడీసీఎంఎస్ అధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 45 కో నుగోలు కేంద్రాలను నిర్వహించి శభాష్ అనిపించుకున్నారు.రాబోవు రోజుల్లో బిఅర్ఎస్ పార్టీ లోనే ఉండనున్నార ? లేక కాంగ్రెస్ గుటికి చేరుతార ? లేక సైలెంట్ గానే కోనసాగనున్నర ? రాబోవు రోజుల్లో తేటతెల్లం కానుంది.ఎది ఏమైనా మరోసారి ఇందల్ వాయి మండలానికి ఉమ్మడి జిల్లాల చైర్మన్ పదవి వస్తుందో రాదో తెలియదు.