నవతెలంగాణ – ఆర్మూర్
ఆహార కల్తీ మహమ్మారిపై చైతన్యవంతులు కావాలని వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి అన్నారు. డివిజన్ అధ్యక్షుడు పౌడపెల్లి అనిల్, జిల్లా ఉపాధ్యక్షుడు రాజుల రామనాధం ల ఆద్వర్యంలో బుధవారం పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఆహార కల్తీ – అయోడిన్ ఉప్పు లో ప్లాస్టిక్ అంశము పై చైతన్య సదస్సు నిర్వహించినారు.. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడుతూ, ఆహార కల్తీ మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్న క్రమంలో వినియోగదారులుగా అందరూ చైతన్య వంతులు కావాలని అన్నారు. ఉప్పు, పప్పులు, వంటనూనెలు మొదలుకొని వివిధ రకాల అయోడిన్ ఉప్పు లు ప్లాస్టిక్ సంచుల్లో అమ్మకం జరుగుతున్నందున మైక్రో ప్లాస్టిక్ కడుపులోకి చేరడం, క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలిపారు. ప్లాస్టిక్ ప్యాకింగ్ వలన అయోడిన్ ఉప్పు లక్ష్యం వృధా అయిపోతున్నదని, కాబట్టి అన్ని రకాల ఉప్పు తయారీ దారులు ప్లాస్టిక్ కవర్ లలో ప్యాకింగ్ చేయరాదని తెలిపారు. ఆహార భద్రతా ప్రమాణాల చట్టం 2013 నిబంధనల ప్రకారం ఆహార పదార్థాలను ఒక వేళ ప్యాకింగ్ లో చేస్తే, ఆ ప్లాస్టిక్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాలు ప్యాకింగ్ పై ముద్రించాలని తెలిపారు.
కాని వివిధ రకాల అయోడిన్ ఉప్పు తయారీ సంస్థలు నాసిరకం ప్లాస్టిక్ కవర్ లలో ఉప్పు ప్యాకింగ్ చేసి, చిన్న పిల్లలతో సహా అందరికీ క్యాన్సర్ రావడానికి కారణం అవుతున్నారని తెలిపారు. ఫోర్టిఫైడ్ బియ్యం నిల్వ లలో జాగ్రత్తల పై పట్టణంలోని అయిదు సెంటర్లు హుస్నాబాద్ గల్లీలో రెండు, జర్నలిస్టు కాలని, మగ్దూమ్ నగర్, లలో అంగన్వాడీ కార్యకర్తలను చైతన్య వంతులను చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పెందోట అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు రాజుల రామనాథం, ఉపాధ్యక్షుడు వి.యన్.వర్మ, ప్రధాన కార్యదర్శి సందు ప్రవీణ్, రూరల్ ఇంచార్జీ కార్యదర్శులు యాటకర్ల దేవేష్, అంగన్వాడీ సూపర్వైజర్లు వెంకట రమణమ్మ, నళిని, వెన్నెల, అంగన్వాడి టీచర్, అంగన్వాడి వెల్పర్స్, విద్యార్థిని, విద్యార్థులు, బాలింతలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు .