నవతెలంగాణ ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని విశాఖ నగర్ లో మంగళవారం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళా సోదరీమణులకు రంగవల్లిక ముగ్గుల పోటీలు నిర్వహించినారు. కాలనీలోని మహిళలు పెద్ద ఎత్తున హాజరై ముగ్గుల పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రాస శ్రీనివాస్ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబించే పండుగలను మనమందరము ఆనందంగా జరుపుకోవాలని తెలిపారు. ఈ ముగ్గుల పోటీలో ప్రథమ బహుమతి మట్ట వనిత, ద్వితీయ బహుమతిని పొలగాని లక్ష్మి, తృతీయ బహుమతిని దొంద స్వర్ణలత గెలుచుకున్నారు. మిగతా వారికి ప్రోత్సాహక బహుమతులు అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి లింబాద్రి, పొద్దుటూరి సురేందర్ రెడ్డి, దొంద రాములు, గట్టు లింబాద్రి, నర్సింగరావు, మట్ట రాజేందర్, రాజ లింగం, జగదీశ్వర్, శ్యామ్, రాజేశ్వర్ గౌడ్ కాలనీ సభ్యులు పాల్గొన్నారు.