లిల్లీపుట్ పాఠశాలలో సంబురంగా కవలల దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ – ఆర్మూర్ 

పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో కవలల దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా కవలల విద్యార్థులందరూ అందర్నీ ఎంతగానో అలరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కవల పిల్లలందరూ వేదికపై ఆటపాటలతో డ్యాన్సులతో ఒకే రూపంలో ఉన్న వీరందరూ అందరినీ ఎంతగానో అలరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 22న ఈ కవలల దినోత్సవం నిర్వహిస్తారని తమ పాఠశాలలో 24మంది విద్యార్థులు కవలలు చదువుకోవడం విశేషం అని కనులకు అందం కవలల బంధం అని వారిని ప్రశంసలతో అభినందించారు. కవల పిల్లల అందరికీ డాన్స్ ప్రోగ్రాం నిర్వహించి వారందరికీ స్వీట్స్ బహుమతులతో వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ ప్రిన్సిపల్ దాసు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.