అన్ని భాషల్లోనూ అదే టైటిల్‌..

Same title in all languages..రజనీకాంత్‌ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టయన్‌- ది హంటర్‌’. దసరా సందర్భంగా నేడు (గురువారం) రిలీజ్‌ అవుతుంది. టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుభాస్కరన్‌ ఈ సినిమాను నిర్మించారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి ఏసియన్‌ సునీల్‌, దిల్‌ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను సీడెడ్‌ ఏరియాలో శ్రీ లక్ష్మీ మూవీస్‌ రిలీజ్‌ చేస్తోంది. నిర్మాత సురేష్‌ బాబు మాట్లాడుతూ, ‘ఈ మూవీ మెయిన్‌ టైటిల్‌ ది హంటర్‌. అన్ని భాషల్లోనూ వేట్టయన్‌ ది హంటర్‌ అని రిలీజ్‌ చేస్తున్నారు. హంటర్‌ అనేదే ఈ చిత్రంలోని మెయిన్‌ పాయింట్‌. ఈ చిత్రంలో రజనీకాంత్‌, అమితాబ్‌, ఫాహద్‌, రానా, మంజు వారియర్‌ ఇలా భారీ తారాగణం కనిపిస్తుంది. టి.జె.జ్ఞానవేల్‌ సెన్సిబుల్‌ డైరెక్టర్‌. ఈ మూవీని థియేటర్లో చూడండి. అందరికీ ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ వస్తుంది’ అని అన్నారు. ‘తెలుగులో ‘వేటగాడు’ అనే టైటిల్‌ను పెట్టాలని అనుకున్నారు. కానీ ఆ టైటిల్‌ వేరే వాళ్లకి ఆల్రెడీ ఉంది. తమిళంలోనూ ఒకప్పుడు కేవలం తమిళ టైటిల్స్‌ మాత్రమే పెట్టాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు అంతా మారిపోతోంది. సినిమా గ్లోబల్‌గా ఎదిగింది. వేరే భాషల్లో అనువాద టైటిల్స్‌ దొరికితే పెడుతున్నారు. లేదంటే ఒకే టైటిల్‌ను అన్ని భాషల్లోనూ రిలీజ్‌ చేస్తున్నారు. ‘జై భీమ్‌’ వంటి అద్భుతమైన సినిమాను తీసిన టి.జె.జ్ఞానవేల్‌ ఈ చిత్రాన్ని కూడా అద్భుతంగా తీశారు’ అని దిల్‌ రాజు చెప్పారు. రానా మాట్లాడుతూ, ‘సినిమా అనే దానికి భాష లేదు.. హద్దుల్లేవు. కథను బట్టి ఆ చిత్రం ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఇప్పటి వరకు రజనీకాంత్‌ చేసిన అన్ని సినిమాల్లోకెల్లా వేట్టయన్‌ చాలా భిన్నంగా ఉంటుంది. రియలిస్టిక్‌ మూవీలో ఇన్ని మంచి పాత్రలు ఉండటం చాలా అరుదు. రజనీకాంత్‌ ముందు నిలబడి డైలాగ్‌ చెప్పడం, నటించే ఛాన్స్‌ రావడం చాలా లక్కీ. ఈ చిత్రాన్ని అందరూ చూసి ఎంజారు చేయండి’ అని చెప్పారు.