సమిష్టి క్రుషి తోనే  డ్రగ్స్ రహిత సమాజం: కలెక్టర్

A drug free society with Samishti Krushi itself: Collectorనవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్..
డ్రగ్స్ నిర్మూలన కోసం అన్ని శాఖలు ఒకటిగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ తెలిపారు.మంగళవారం కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరంలో నషాముక్తి భారత్ అభియాన్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం కమిటీ సభ్యులతో నిర్వహించారు. జిల్లాలో డ్రగ్స్ నిర్మూల  కోసం లైన్ డిపార్ట్మెంట్స్ ఒకటిగా కలిసి పనిచేయాలని కలెక్టర్ తెలిపారు.ప్రతి స్కూల్ కాలేజీలలో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని, విద్యార్థులు అన్ని రకాల మాదకద్రయాలకు దూరంగా ఉండాలని, వాటిపై అందరికీ అవగాహన కల్పించాలని, జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు వాలంటీర్స్ ద్వారా అవగాహన కార్యక్రమాలు చేయాలని కలెక్టర్ కమిటీకి సూచించారు. డి ఆర్ డి ఓ, డి డబ్ల్యు ఓ వారి సంఘాల మిటింగులలో ఏజెండా ఐటమ్ గా  ముందుగా చర్చించాలన్నారు. గ్రామ పంచాయతీలలో జరిగే గ్రామ సభలలో కూడా డ్రగ్స్ నిషేధంపై చర్చించాలని, యువతకు, పెద్దలకు అవగాహన కలిగేలా కార్యక్రమాల నిర్వహించాలని కలెక్టర్ సూచించారు .మండల జిల్లా స్థాయిలో విద్యార్థులకు డ్రగ్స్ వ్యతిరేకతపై  వ్యాసరచన,డిబేట్, పోటీలు నిర్వహించాలని డీఈవో, డి ఏ ఈ ఓ కు కలెక్టర్ తెలిపారు. పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని కలెక్టర్ డీఈఓ కి సూచించారు. పాఠశాలలకు వంద మీటర్ల లోపున ఎలాంటి పాన్ షాపుల లాంటి దుకాణాలు లేకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో మరకద్రవ్యాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు డిఎస్పి రవి ఆదివోలు కోదాడ సూర్యనారాయణ హుజూర్నగర్ ఆర్డీవో శ్రీనివాసులు డిడబ్ల్యువో కే నరసింహారావు డైమండ్హెచ్లం డిఈఓ అశోక్ డ్రగ్ ఇన్స్పెక్టర్ సురేందర్ డి ఏ ఈ ఓ బాలు నాయక్ సి సెక్షన్ సుబ్రహ్మణ్యం శ్రీనివాసరాజు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కిరణ్ కుమార్ వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి ఎక్సైజ్ అధికారి శీలం మల్లయ్య అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.