ప్రారంభమైన సమ్మక్క సారక్క జాతర

నవతెలంగాణ – తంగళ్ళపల్లి
సమ్మక్క సారక్క జాతర బుధవారం నుండి ప్రారంభమైంది. తంగళ్ళపల్లి మండలంలోని ఓబులాపూర్ గ్రామంలో వెలసిన సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చే భక్తులు మూడు రోజులపాటు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఎండ నుండి తట్టుకునేందుకు జాతర ప్రాంగణం మొత్తం టెంట్లు చలువ పందులతో పూర్తిస్థాయి ఏర్పాట్లను చేపట్టారు. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులకు దాహాన్ని తీర్చేందుకు మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. జాతరలో రాత్రిపూట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు భారీగా ఏర్పాటు చేశారు. జాతరలో ఆకతాయిల నుండి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. రాత్రిపూట భక్తులు ఉండేందుకు నిర్వాహకులు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చే ముఖ్య అతిథులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బుధవారం నుండి ప్రారంభమైన సమ్మక్క సారక్క జాతరలో ముందుగా సమ్మక్క గద్దెకు చేరుకుంది. అనంతరం భక్తులు తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఉదయం నుండి సాయంత్రం దాకా పూజలు నిర్వహిస్తూనే ఉన్నారు.