నవతెలంగాణ – పెద్దవూర
ఈ నెల 12 నుంచి 15 వరకు చిన మేడారంగా పిలువబడే నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం నాగార్జున సాగర్ హైదరాబాద్ జాతీయ రహదారి చలకుర్తి గ్రామం పొట్టి చెలిమ క్రాస్ రోడ్డు వద్ద వెలసిన సమ్మక్క సారక్క జాతర అంగ రంగ వైభవంగా జరుగుతుందని ఆలయ అధ్యక్షులు,ధర్మ కర్త గుంజ అంజమ్మ, కార్యదర్శి నాగపురి లక్ష్మి రామస్వామీ, శుక్రవారం తెలిపారు.మన నాగార్జున సాగర్ కృష్ణానది ఒడ్డున సమ్మక్క- సారక్క దేవతామూర్తుల జాతర జరుగుచున్నదని ఈ నెల 12 న సమక్క-సారలమ్మ దేవస్థానం వద్ద అన్నదానం జరుతుందని అన్నారు.కావున ముఖ్యనాయకులు, దాతలు, పెద్దలు,చిన్నలు, యూత్ నాయకులు భక్తజనులందరు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్ల ఆశీస్సులను పొంది, జాతరను జయప్రదము చేయగలరని కోరారు.