
రాఘవపట్నంలో సమ్మక్క, సారాలమ్మ జాతరలో గురువారం రెండవ రోజు భాగంగా ఊరగుట్ట నుండీ ఈరోజు సాయంత్రం 6గంటలకు ప్రధాన పూజారి కంటేం సమ్మయ్య మరియు కంటెం వంశస్థులు,జలకం వడ్డే వాసం. సమ్మయ్య ఆధ్వర్యంలో సమ్మక్క తల్లీని డోలు వద్యాలతో ఘనంగా గుడికి తీసుకుని రావడం జరిగింది. ఇందులో భాగంగా వివిధ మండలాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా బావించే భక్తులు అధిక సంఖ్యలో శివసత్తులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా పూజరులు కాంటెం రవికుమార్, నాగేష్, ప్రేంసాగర్, లక్ష్మీనారాయణ, నాగేందర్,రంజిత్కుమార్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, వివిధ ఆదివాసీ భక్తులు పాల్గొన్నారు.