సమ్మయ్య కు పితృ వియోగం 

Sammayya lost his father– పరామర్శించిన మండలాధ్యక్షుడు సురేష్ 
నవతెలంగాణ – పెద్దవంగర
కాంగ్రెస్ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎరుకలి సమ్మయ్య తండ్రి చంద్రమౌళి (79) వృద్ధాప్యం తో గురువారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, చంద్రమౌళి మృతదేహాన్ని కి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. కార్యకర్తల కష్టసుఖాల్లో తోడుగా ఉంటామని భరోసా కల్పించారు. ఆయన వెంట మహబూబాబాద్ జిల్లా సంయుక్త కార్యదర్శి ముత్యాల పూర్ణచందర్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు  బీసు హరికృష్ణ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి ఓరుగంటి సతీష్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు సీతారాం నాయక్, బానోత్ వెంకన్న, రాంబాబు, సతీష్ రెడ్డి తదితరులు ఉన్నారు.