
మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన మైనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పిడిశెట్టి సంపత్ శుక్రవారం భౌతికశాస్త్రంలో డాక్టరేట్ పొందారు. తల్లిదండ్రులు పిడిశెట్టి లక్ష్మి భూమయ్య సహాకారంతో చిన్ననాటి నుంచి చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. అలాగే పీజీ, బీఈడీ పూర్తి చేసిన ఆయన యూజీసీ నెట్‌లో ఆలిండియా 87వ ర్యాంకు సాధించి ఉస్మానియా యూనివర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్ కరుణాసాగర్ ఆధ్వర్యంలో భౌతికశాస్త్రంలో పరిశోధనకు గాను ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ అందించినట్లు ఆయన తెలిపారు. అలాగే వరుసగా ట్రైబల్ వెల్ఫెర్ లో టీజీటీ ఉద్యోగం, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఉద్యోగం, మైనార్టీ గురుకుల సోసైటీలో ప్రిన్సిపాల్‌గా మూడు ఉద్యోగాలు సాధించారు. ప్రస్తుతం తిమ్మాపూర్‌లోని మానకొండూర్ మైనారిటీ గురుకుల ప్రిన్సిపాల్‌గా సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, గ్రామస్థులు, మండల ప్రజలు అభినందనలు తెలిపారు.