బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా సంసోత్ రాజన్న నాయక్

నవతెలంగాణ-గోవిందరావుపేట :
బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా మండలంలోని పసుర గ్రామానికి చెందిన సంసోథ్ రాజన్న నాయక్ నియమితులయ్యారు. గురువారం మండల కేంద్రంలో బూత్ అధ్యక్షుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి రాజన్న నాయక్ నియామకాన్ని ధ్రువీకరించారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ మేయర్ మాజీ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్వరరావు రాజన్న నియామక పత్రాన్ని అందించారు. అనంతరం రాజన్న నాయక్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతను నిబద్ధత తో నిర్వర్తిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. తనపై ఉంచిన బాధ్యతను కర్తవ్యం గా భావించి నెరవేరుస్తానని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రహల్లాద్ , రాష్ట్ర కమిటీ సభ్యులు అజ్మీర కృష్ణవేణి నాయక్, తాటి కృష్ణ, రాజు నాయక్, ములుగు అసెంబ్లీ కన్వీనర్ బలరాం ,తక్కలపల్లి దేవేందర్ రావు, రాజు నాయక్, జవహర్ నాయక్ మద్దినేని తేజ రాజు, ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.