యువ ఆవిష్కర్తలకు సామ్‌సంగ్‌ నగదు బహుమతి

గూర్‌గావ్‌ : తాము నిర్వహించిన ‘సాల్వ్‌ ఫర్‌ టుమారో’ నూతన ఆవిష్కర్తల పోటీలో టాప్‌ 10 బృందాలకు నగదు బహుమతిని అందించినట్లు సామ్‌సంగ్‌ ఇండియా తెలిపింది. ఈ యువత బృందాల్లో సముద్ర నీటిని తాగు నీరుగా మార్చడం, పంటలలో తెగుళ్లు, కీటకాలను గుర్తించడం, బీచ్‌లను శుభ్రం చేయడం, మరింత సుస్థిరమైన లెదర్‌ ట్యానింగ్‌ ప్రక్రియను అభివద్ధి చేయడం నుండి వినికిడి లోపం కలిగిన వారికి మరింత సదుపాయం కల్పించడం వంటి నిజ జీవితంలోని సమస్యలను పరిష్కరించిన యువ ఆవిష్కర్తలు ఉన్నారని పేర్కొంది. ప్రతీ బృందానికి రూ.20వేలు, సామ్‌సంగ్‌ గెలాక్సీ బుక్‌ 3 ప్రో 360 ల్యాప్‌టాప్‌, గెలాక్సీ బడ్స్‌2 ప్రోతో సర్టిఫికెట్‌ అందించడం జరిగిందని పేర్కొంది.