న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్ తన గెలాక్సీ ఎఐ ఫీచర్లను మరిన్ని ఉత్పత్తులకు విస్తరిస్తున్నట్లు తెలిపింది. ఇటీవలే గెలాక్సీ ఎస్24లో తొలుత నోట్ అసిస్ట్, లైవ్ ట్రాన్స్‌లేట్, జనరేటివ్ ఎడిట్ తదితర ఎఐ బహుళ ఫీచర్లను అందించింది. ఈ ఫీచర్లను గెలాక్సీ ఎస్23, సిరిస్, గెలాక్సీ జడ్ ఫోల్డ్5, జడ్ ప్లిప్5, టాప్ ఎస్9 సిరీస్‌ల్లోనూ అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది.