సామ్‌సంగ్‌ హోలీ ఆఫర్లు

న్యూఢిల్లీ : సామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ హోలీ పండగ సందర్బంగా ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు పేర్కొంది. తమ వెబ్‌సైట్‌, సామ్‌సంగ్‌ ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్లలో ఎంపిక చేసిన గాలక్సీ స్మార్ట్‌ఫోన్‌లపై 60 శాతం వరకు తగ్గింపు, టివిలపై 48 శాతం వరకు తగ్గింపును అందిస్తున్నట్లు పేర్కొంది. గెలక్సీ టాబ్లెట్‌లు, ఉపకరణాలు, బ్యాండ్‌లపై 55 శాతం వరకు డిస్కౌంట్‌ కల్పిస్తున్న ట్లు తెలిపింది. రిఫ్రిజిరేటర్‌ మోడళ్లపై రూ.15,125 వరకు ఎక్సేంజీ ప్రయోజనాలు, 49 శాతం వరకు తగ్గింపు అందిస్తున్నట్లు పేర్కొంది.