గెలాక్సీ ఎ 14ను విడుదల చేసిన శామ్‌సంగ్

నవతెలంగాణ – హైదరాబాద్: మీ స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని మెరుగుపరిచేలా ప్రీమియం డిజైన్, హై-రిజల్యూషన్ డిస్‌ప్లే, అసాధారణమైన కెమెరా సామర్థ్యాలు, దీర్ఘకాలం నిలిచి ఉండే బ్యాటరీ లైఫ్, అద్భుతమైన ఫీచర్ల శ్రేణిని మిళితం చేసే సరికొత్త Galaxy A14ని విడుదల చేస్తున్నట్లు శామ్‌సంగ్ నేడు ప్రకటించింది. మీకు అల్టిమేట్ సహచరునిగా ఉండేలా Galaxy A14ని డిజైన్ చేశారు. సొగసైన మరియు ప్రీమియం సౌందర్యాన్ని కలిగిన Galaxy A14, ఐకానిక్ గెలాక్సీ సిగ్నేచర్ డిజైన్‌తో అందరినీ ఆకట్టుకునే పరికరంగా నిలుస్తోంది. పూర్తి హెచ్‌డి+ రిజల్యూషన్‌తో కూడిన పెద్ద 6.6’’ స్క్రీన్, మీ అన్ని మల్టీమీడియా కార్యకలాపాలలో శక్తివంతమైన వర్ణాలు మరియు అద్భుతమైన డిటెయిల్స్‌ను నిర్ధారిస్తూ లీనమయ్యే విజువల్ అనుభవాన్ని అందిస్తుంది.అప్‌గ్రేడ్ చేసిన 13ఎంపి సెల్ఫీ కెమెరాను కలిగిన Galaxy A14 అధిక రిజల్యూషన్ చిత్రాల కోసం 50 ఎంపి ప్రైమరీ కెమెరాతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇది అల్ట్రా-వైడ్ మరియు మైక్రో కెమెరాను కూడా కలిగి ఉంది. వినియోగదారులు సృజనాత్మక అవకాశాలను అన్వేషించేందుకు, కచ్చితమైన మరియు స్పష్టతతో క్లిష్టమైన డిటెయిల్స్‌ను బంధించేందుకు ఇవి అనుమతిస్తాయి, దాని ఆకట్టుకునే ఫీచర్లతో పాటు, Galaxy A14 ఒక శక్తివంతమైన 5000mAh బ్యాటరీని కలిగి ఉండగా, ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 2 రోజుల పాటు ఉంటుంది.
ఎక్సినోస్ 850 చిప్‌సెట్, ఒన్ యుఐ 5, ర్యామ్ ప్లస్, గోప్యత, సెక్యూరిటీ డ్యాష్‌బోర్డ్‌తో 8జీబీ వరకు ర్యామ్, సరికొత్త ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌తో వేగవంతమైన మరియు సురక్షితమైన వినియోగదారు అనుభవాన్ని Galaxy A14 అందిస్తుంది. నాలుగేళ్ల (4) సెక్యూరిటీ అప్‌డేట్‌లు మరియు 2 ఓఎస్ అప్‌గ్రేడ్‌లతో Galaxy A14 భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉంటుంది. ఈ Galaxy A14 మూడు స్టైలిష్ వర్ణాలలో – నలుపు, లేత ఆకుపచ్చ మరియు సిల్వర్‌లలో అందుబాటులో ఉంది. మీ వ్యక్తిగత శైలిని వ్యక్తీకరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. శామ్‌సంగ్ ఎకో-కాన్షియస్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్‌తో, Galaxy A14 పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. పర్యావరణ అనుకూల పదార్థాలతో రూపొందించబడిన ఇది ఇది మరింత స్థిరమైన భవిష్యత్తుకు దోహదపడుతుంది.
మెమరీ వేరియంట్లు మరియు ధర
Galaxy A14 4/64జిబి వేరియంట్‌కు రూ.13999 మరియు 4/128జిబి వేరియంట్‌ రూ.14999 నుంచి ప్రారంభమవుతుంది మరియు శామ్‌సంగ్ ప్రత్యేకమైన, భాగస్వామి స్టోర్‌లు, Samsung.com మరియు ఇతర ఆన్‌లైన్ ప్లేయర్‌ల వద్ద లభిస్తుంది. పరిచయ ఆఫర్‌గా, ఒక ఇర్రెసిస్టిబుల్ ఛాయిస్‌గా వినియోగదారులు రూ.1000 క్యాష్‌బ్యాక్‌ని పొందవచ్చు.