Galaxy A54 5Gని విడుదల చేసిన శామ్‌సంగ్

  • – లైవ్ కామర్స్ వాణిజ్య వినియోగదారులకు INR 5299 విలువైన పరిమిత-కాల ఆఫర్‌లను ప్రకటించింది

నవతెలంగాణ- హైదరాబాద్ : కొత్తగా అద్భతమైన తెలుపు రంగులో శామ్‌సంగ్ తన Galaxy A54 5G 8/256 GB వేరియంట్‌ను సెప్టెంబరు 8 నుంచి భారతదేశంలో విక్రయిస్తోంది. తెలుపు రంగులో కొత్తగా అందుబాటులో తీసుకువస్తున్న ఇది వినియోగదారులకు వారి వ్యక్తిగత శైలిని అభివ్యక్తీకరించేందుకు మరిన్ని ఎంపికలను అందిస్తుంది. ప్రస్తుతం ఆసమ్ లైమ్, ఆసమ్ గ్రాఫైట్, ఆసమ్ వైలెట్ కలర్ వేరియంట్‌లలో Galaxy A54 5G లభిస్తుంది. శామ్‌సంగ్ ఇటీవల Galaxy A54 , Galaxy A34 5Gపై కొత్త అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. వినియోగదారులు ఇప్పుడు INR 30999 ప్రారంభధరలో , Galaxy A34 5Gని INR 26999 నుంచి సమర్థవంతమైన ధరతో కొనుగోలు చేయవచ్చు. సవరించిన ధరలో INR 2000 తక్షణ క్యాష్‌బ్యాక్ మరియు ఐసిఐసిఐ బ్యాంక్ , ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్‌లపై వర్తించే INR 2000 అదనపు బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఉంటుంది. INR 40999తో విడుదలైన Galaxy A54 8/256 GB వేరియంట్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు కేవలం INR 36999 ధరలోనే దీన్ని కొనుగోలు చేయవచ్చు. అదనంగా, మెరుగైన అందుబాటు ధరను కోరుకునే వినియోగదారులు జీరో డౌన్‌పేమెంట్‌తో, సౌకర్యవంతమైన 12-నెలల నో-కాస్ట్ ఈఎంఐ ప్రయోజనాన్ని పొందవచ్చు. అదనంగా, శామ్‌సంగ్ Galaxy A54 5G మరియు Galaxy A34 5G కోసం లైవ్ కామర్స్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబరు 9 అర్ధరాత్రి 12 వరకు నిర్వహిస్తుంది. అలాగే, Samsung.comలో లైవ్ కామర్స్ ఈవెంట్‌లో పరికరాలు కొనుగోలు చేసే వినియోగదారులు INR 1299 విలువ చేసే 25W ట్రావెల్ అడాప్టర్‌కు అందుకునేందుకు అర్హత కలిగి ఉంటారు.  శామ్‌సంగ్ Galaxy A54 5G మరియు Galaxy A34 5Gలు ప్రీమియం రూపాన్ని, అనుభూతిని  దీర్ఘకాలం మన్నిక అందించేలా తయారు చేయగా, ఇవి 5000mAh బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటాయి. అవి శామ్‌సంగ్ వాలెట్ మరియు వాయిస్ ఫోకస్ వంటి మెరుగుపరచిన ప్రయోగాత్మక ఫీచర్‌లను, డ్యూయల్ డాల్బీ ఇంజినీర్డ్ స్టీరియో స్పీకర్‌ల వంటి అద్భుతమైన వినోద లక్షణాలను కలిగి ఉంటాయి. రెండు పరికరాలు IP67 రేటింగ్‌తో కొనసాగేలా రూపొందించారు. ధూళి, ఇసుక నిరోధకతను కలిగి ఉండే ఇవి, మీ అన్ని సాహసాలకు అనువైనవిగా ఉంటాయి. ఇప్పుడు Galaxy A54 5G 12MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో పాటు 50MP OIS ప్రైమరీ లెన్స్‌ను కలిగి ఉండగా, Galaxy A34 5G 48MP OIS ప్రైమరీ లెన్స్ మరియు 8MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో వస్తుంది. రెండు మోడల్స్ కూడా 5MP మాక్రో లెన్స్‌తో వస్తాయి. శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ సిరీస్ నుంచి చాలా ఇష్టపడే ‘నైటోగ్రఫీ’ ఫీచర్ Galaxy A54 5G మరియు Galaxy A34 5Gలో దాని పరిచయంతో మరింత అందుబాటులోకి వచ్చింది. రెండు పరికరాల వివిడ్ డిస్‌ప్లే సూపర్ అమోల్డ్ టెక్నాలజీ మరియు 1000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో సహజమైన జీవిత రంగులను కలిగి ఉంటుంది. రెండు పరికరాల్లోని 120Hz రిఫ్రెష్ రేట్ ఫాస్ట్ మోషన్‌లో కూడా చాలా మృదువైన దృశ్యం నుంచి దృశ్య పరివర్తనలను అనుమతిస్తుంది.  ఈ Galaxy A54 మరియు Galaxy A34 పరికరాలు సామ్‌సంగ్ డిఫెన్స్-గ్రేడ్ సెక్యూరిటీ ప్లాట్‌ఫారమ్ నాక్స్‌తో సురక్షితను అందిస్తుండగా, ఇది మీ వ్యక్తిగత డేటాను రియల్ టైమ్‌లో రక్షిస్తుంది. అలాగే, Galaxy A54 5G మరియు Galaxy A34 5G కూడా నాలుగు OS అప్‌డేట్‌లు మరియు 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తూ, పరికరాలు అప్‌-టు-డేట్‌గా ఉండేలా చూస్తాయి. రాబోయే ఏళ్లలో అత్యుత్తమ పనితీరును అందజేస్తూ, వాటిని వినియోగదారులకు అగ్ర ఎంపికగా మారుస్తుంది.