ఐఐటి కాన్పూర్‌తో సామ్‌సంగ్‌ ఆర్‌అండ్‌డీ ఒప్పందం

గూర్‌గావ్‌ : కీలక వృద్థి రంగాలపై దృష్టి పెట్టడానికి ఐదేళ్ల కాలానికి గాను ఐఐటి కాన్పుర్‌తో అవగాహన ఒప్పందం కుదర్చుకున్నట్లు సామ్‌సంగ్‌ ఆర్‌అండ్‌డి ఇన్స్‌ట్యూట్‌ తెలిపింది. విద్యార్థులు, అధ్యాపకులకు విజువల్‌, ఆరోగ్యం, విజువల్‌, ఎఐ, క్లౌడ్‌ తదితర ఇతర అభివద్ధి చెందుతున్న సాంకేతికతలపై పరిశోధనలో సహకరించుకోవడానికి, నైపుణ్యాలను పెంచుకోవడానికి అవగాహన కుదర్చుకున్నట్లు పేర్కొంది. ఇందుకోసం విద్యార్థులు, అధ్యాపకులకు సహాయం అందించనున్నట్లు తెలిపింది.