– ఎంపిక చేసిన గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లపై 57% వరకు తగ్గింపు శాంసంగ్ ప్రీమియం మరియు లైఫ్ స్టైల్ టీవీల ఎంపిక చేసిన మోడల్‌లపై 48% వరకు తగ్గింపు
– శాంసంగ్గెలాక్సీ టాబ్లెట్‌లు, ఉపకరణాలు, వేరబల్స్ పై గరిష్టంగా 50% తగ్గింపుతో లభిస్తాయి..
– రూ. 15125 వరకు ఎక్స్చేంజ్ ప్రయోజనాలతో పాటుగా ఎంపిక చేయబడిన రిఫ్రిజిరేటర్ మోడల్‌లపై గరిష్టంగా 52% తగ్గింపు
– ప్రముఖ కార్డ్‌లతో గరిష్టంగా 22.5% క్యాష్‌బ్యాక్ (రూ 25000 వరకు)
నవతెలంగాణ- గురుగ్రామ్: భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన శాంసంగ్ , గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, వేరబల్ వస్తువులు, శాంసంగ్ టీవీలు, ఇతర డిజిటల్ ఉపకరణాలు వంటి అనేక రకాల శాంసంగ్ ఉత్పత్తులపై బంపర్ ఆఫర్‌లు, క్యాష్‌బ్యాక్‌తో గ్రాండ్ రిపబ్లిక్ సేల్‌ను ప్రారంభించింది. ఈ ఆఫర్‌లు Samsung.com, శాంసంగ్ షాప్ యాప్, శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు HDFC బ్యాంక్, ICICI, Axis మరియు ఇతర ప్రముఖ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లపై గరిష్టంగా 22.5% క్యాష్‌బ్యాక్ (రూ.25000 వరకు) పొందవచ్చు. ఈ బొనాంజా విక్రయ సమయంలో, గెలాక్సీ ఏ సిరీస్, ఎం సిరీస్, ఎఫ్ సిరీస్, ఎస్ సిరీస్ మరియు గెలాక్సీ జెడ్ సిరీస్ యొక్క ఫ్లాగ్‌షిప్ మోడల్‌లను కొనుగోలు చేసే వినియోగదారులు 57% వరకూ తగ్గింపును పొందవచ్చు. సరికొత్త గెలాక్సీ ఎస్ 24 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రీ-బుకింగ్ చేయడంపై వినియోగదారులు అద్భుతమైన ఆఫర్‌లను కూడా పొందుతారు. గ్రాండ్ రిపబ్లిక్ డే సేల్ కింద, వినియోగదారులు కేవలం రూ. 54999 కి గెలాక్సీ ఎస్ 23ని పొందవచ్చు. గెలాక్సీ బుక్ గో , గెలాక్సీ బుక్ 3 మరియు గెలాక్సీ బుక్ 3 ప్రో వంటి గెలాక్సీ ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసే వారు 46% వరకు తగ్గింపును పొందవచ్చు మరియు ఎంపిక చేసిన గెలాక్సీ టాబ్లెట్‌లు మోడల్స్ , వేరబల్స్ మరియు ఉపకరణాలు కొనుగోలు చేసే వినియోగదారులు 50% వరకు తగ్గింపు పొందవచ్చు.
శాంసంగ్ టెలివిజన్‌ల ప్రీమియం మరియు లైఫ్‌స్టైల్ మోడల్‌లను కొనుగోలు చేసే వినియోగదారులు రూ . 15250 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ ప్రయోజనంతో 48% వరకు తగ్గింపును పొందవచ్చు. నియో QLED, QLED ఎంపిక చేసిన మోడల్‌లను కొనుగోలు చేసే వినియోగదారులు కింది వాటిలో దేని నుండి అయినా ప్రత్యేక బహుమతిని పొందుతారు – రూ.124990 విలువైన గెలాక్సీ S23 అల్ట్రా లేదా రూ. 69990 విలువైన 50″ Serif TV లేదా రూ . 38990 (Q700C / C450) విలువైన సౌండ్‌బార్.ఈ విక్రయ సమయంలో, రిఫ్రిజిరేటర్‌ల వంటి శాంసంగ్ డిజిటల్ ఉపకరణాలను కొనుగోలు చేసే వినియోగదారులు ఎంపిక చేసిన రిఫ్రిజిరేటర్‌లపై 52% వరకు తగ్గింపును పొందుతారు. ఎంపిక చేసిన మోడళ్లపై వినియోగదారులు రూ. 15125 వరకు ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలను కూడా పొందవచ్చు. 28 లీటర్ స్లిమ్‌ఫ్రై మైక్రోవేవ్, 32 లీటర్ Wi-Fi ఎనేబుల్ చేయబడిన బెస్పోక్ మైక్రోవేవ్ వంటి మైక్రోవేవ్‌ల కొనుగోలుపై, వినియోగదారులు 45% వరకు తగ్గింపు పొందవచ్చు. ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ల యొక్క EcobubbleTM శ్రేణి యొక్క ఎంపిక చేసిన మోడల్‌లను కొనుగోలు చేసే వినియోగదారులు అప్‌గ్రేడ్ బోనస్‌గా రూ. 3000 అదనపు ప్రయోజనంతో 49% వరకు తగ్గింపును పొందుతారు.