
దేశం కోసం శ్రమిస్తున్నకార్మిక, రైతుల జీవితాలు , జీవనోపాధిపై నిరంతరాయంగా అనాగరిక దాడులను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేస్తుందని సంయుక్త కిసాన్ మోర్చా యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ కొల్లూరి రాజయ్య ఆరోపించారు. సోమవారం స్థానిక ఎస్పీ హోటల్లో సంయుక్త కిసాన్ మోర్చా (ప్రజా సంఘాల) ఆధ్వర్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతాంగ, కార్మిక ప్రజా వ్యతరేక నల్ల చట్టాల విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా నిర్వహించే పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంద్ ను విజయవంతం చేయాలనీ కోరుతూ రౌండ్ టేబుల్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నారన్నారు. ,ఇప్పటి వరకు 36సార్లు దేశ వ్యాపితంగా సమ్మె జరిగిందన్నారు. మోడీ ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారన్నారు. రైతు నల్ల చట్టాలను తీసుకోచిందని, రైతు పోరాటం వలన మోడీ ప్రభుత్వం దిగివచిందని అన్నారు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరిపాలనా అధికారాలను పూర్తిగా దుర్వినియోగం చేస్తూ, రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రజల హక్కులనుకాలరాస్తోందన్నారు. ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తుందని మండిపడ్డారు. కార్మికుల సంక్షేమం కోసం పోరాడి తెచ్చుకున్న 44 కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం నిరంకుశంగా రద్దు చేసి, కార్మిక చట్టాలను 4 కోడ్ లుగా విభజించి కార్మికులను కార్పొరేట్ సంస్థలకు బానిసలుగా మార్చివేసిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్ర ప్రభుత్వ కళ్ళు తెరిపించేందుకు కార్మికులు, రైతులు కలసి ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంద్ నిర్వహిస్తున్నామని, సామాన్య ప్రజలు, విద్యార్ధి, నిరుద్యోగులు, మహిళలు, కార్మికులు, రైతులు పెద్దఎత్తున పాల్గొని దేశవ్యాప్తంగా పారిశ్రామిక గ్రామీణ బంద్ జయప్రదం చేయాలనీ కోరారు. ఈ సందర్బంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోఈ నెల 26వ తేదీన జరిగే ట్రాక్టర్ మరియు వాహనాల ర్యాలీని జయప్రదం చేయాలని సమావేశంలో పాల్గొన్న వక్తలు పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి గోరేటి రాములు, బొల్లు యాదగిరి, మామిడాల సోమయ్య, గడ్డo మంకయ్య, బర్మా బాబు, అధ్యక్షవర్గoగా వ్యవహరించారు, ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు, బీఎస్పీ రైతు సంఘం అధ్యక్షులు బట్టు రాంచంద్రయ్య, తెలంగాణ రాష్ట్ర రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కేవిడి ఉప్పలయ్య, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్, ఏఐకెఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి చిరబోయిన రాజయ్య, నాయకులు బబ్బురి పోశెట్టి, రమేష్, ఉప్పల కొమరయ్య, తెడ్డు ఆంజనేయులు, సామల శోభన్ బాబు, సత్య కుమార్, నర్సింహా రెడ్డి, సామల భాస్కర్, అంజి బాబు, పాల్గొన్నారు.