ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు ఇంజినీరింగ్‌, లా కాలేజీల మంజూరు

– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మెన్‌ చిన్నారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాకు ఇంజినీరింగ్‌, లా కాలేజీలు మంజూరు అయ్యాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మెన్‌ డాక్టర్‌ జి చిన్నారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో విద్యాభివృద్ధికి ఎంతో మేలు చేకూరుతుందని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యా రంగంలో ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా చాలా వెనుకబడిందనీ, విద్యా రంగంలో ఇంకా పురోగతి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో దోహదపడు తుందని వివరించారు. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రివర్గ సభ్యులకు చిన్నారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.