
నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండలంలోని ఆవలగావ్ గ్రామంలో గల దళితుల కోసం ఎస్సీ కమ్యూనిటీ హాల్ 5 లక్షల నిధులతో నిర్మించడానికి శుక్రవారం నాడు గ్రామ సర్పంచ్ శాంతేశ్వర్ ఎంపిటిసి సభ్యులు బోండ్ల వార్ సాయిలు ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణం గుత్తేదార్ సంజు గౌడ్ గ్రామ ఉపసర్పంచ్ మారుతి దళిత గ్రామ పెద్దలు యువకులు పాల్గొని భూమి పూజ చేశారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గ్రామ ఎంపీటీసీ సభ్యులు మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసం ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే హనుమంతు సిందే కృషితో ఐదు లక్షల నిధులు మంజూరు అయినట్లు వారు తెలిపారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి నాగనాథ్ దళితులు గ్రామస్తులు పాల్గొన్నారు.