నిర్మాణం మాటున ఇసుక దందా..!

Instead of construction, sand danda..!– గూడెంలో యథేచ్ఛగా అక్రమ ఇసుక నిల్వలు 
– ప్రభుత్వ సెలవు రోజుల్లో భారీగా ఇసుక తరలింపు
– సీపీ అధేశాల అమలు అంతంతే..
– అధికారులు అక్రమాలకు అజ్యామిస్తున్నారని విమర్శలు 
నవతెలంగాణ – బెజ్జంకి 
మండల పరిధిలోని కల్లేపల్లి రేవెన్యూ శివారులోని గూడెం గ్రామం.సర్వే నంబర్ 321 యందు గతంలో పలువురు గ్రామస్తులు అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తహసిల్దార్ విజయ ప్రకాశ్ రావు,ఎస్ఐ నరేశ్ రెడ్డి అధ్వర్యంలో తొలగించి సుమారు 7 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు స్వాదీనం చేసుకున్నారు.స్వాదీనం చేసుకున్న భూమిలో గ్రామాభివృద్ధి పనులకు కేటాయించేల ప్రతిపాదనలు సిద్దం చేస్తామని అధికారులు ప్రకటించారు.ప్రస్తుతం అధికారులు స్వాదీనం చేసుకున్న భూమిలో గ్రామంలో కొందరు అధికార పార్టంటూ అక్రమ నిర్మాణాలకు తెరలేపారు.దీంతో గ్రామస్తులు ఇటీవల పంచాయితీ కార్యదర్శికి అక్రమ నిర్మాణాలకు అనుమతులు జారీ చేయ్యెద్దంటూ పిర్యాదు చేశారు.ప్రభుత్వ భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను త్వరితగతిన తొలగించేల అధికారులు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
నిర్మాణం మాటునా ఇసుక దందా..
ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణం చేపడుతూనే మరో దిక్కు నిర్మాణం మాటునా అక్రమ ఇసుక దందా స్థానికుడు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.ప్రభుత్వ సెలవు రోజుల్లో మండల పరిధిలోని మోయతుమ్మెద వాగు ఇసుకను పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో తరలించి అక్రమ నిర్మాణం అవరణంలో భారీగా యథేచ్ఛగా ఇసుక నిల్వలు ఏర్పాటు చేయడం గ్రామస్తులను విస్మయానికి గురిచేస్తోంది.అక్రమ నిల్వ చేసిన ఇసుకను ప్రభుత్వ సెలవు రోజు,రాత్రి వేళల్లో సిద్దిపేట పట్టణానికి ఇసుక మాఫీయాదారుడు తరలిస్తున్నాడని గ్రామస్తులు బాహాటంగానే చెబుతున్నారు.రాత్రి వేళలో మండల కేంద్రం నుండి అక్రమ ఇసుక రవాణ సాగిస్తున్న సంబంధిత అధికారులు చూసిచూడట్టు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా మండలాధికారులు అక్రమాలకు అజ్యాపోస్తున్నారని విమర్శలను తిప్పికొట్టేల నిజాయితీగా విధులు నిర్వర్తించాలని పలువురు కొరుతున్నారు.
సీపీ అధేశాల అమలు అంతంతే..
జూలై 24,2024న సిద్దిపేట సీపీ అనురాధ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను అకస్మికంగా సందర్శించి చట్ట వ్యతిరేక,అక్రమ ఇసుక రవాణపై కఠినంగా వ్యవహరించాలని శాఖ అధికారులకు అధేశించారు.సీపీ అధేశాలను అధికారులు అమలు చేయడంలో అలసత్వం ప్రదర్శించడం వల్లే మండలంలో యథావిధిగా అక్రమ ఇసుక రవాణ జోరుగా కొనసాగుతుందనే వదంతులు వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా సీపీ అధేశాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని అధికారులను గాగీల్లపూర్,గూడెం గ్రామాల ప్రజలు కోరారు.
పై అధికారుల అధేశానుసారం చర్యలు: లావణ్య,పంచాయతీ కార్యదర్శి,గూడెం
321 సర్వే నంబర్ యందు సుమారు 7 ఎకరాల భూమిని అధికారులు ప్రభుత్వ భూమిగా గుర్తించి స్వాదీనం చేసుకున్నారు.ప్రభుత్వ భూమిలో ఇంటి నిర్మాణ అనుమతి కోసం స్థానికుడు దరఖాస్తు చేసుకున్నాడు. గ్రామస్తులు జిల్లా కలెక్టర్,రెవెన్యూ కలెక్టర్,డీపీఓ,తహసిల్దారుకు ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలకు అనుమతులివ్వద్దంటూ పిర్యాదు చేశారు.పై అధికారుల అధేశానుసారం చర్యలు తీసుకుంటాం.