
ఏలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న లారీని పట్టుకొని సీజ్ చేసినట్లు చిన్నకోడూరు ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామ శివారులో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో భూపాలపల్లి నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకతో వస్తున్న లారీ నెం. టిఎస్ 36టిఎ 2169 ని పట్టుకొని కేసు నమోదు చేసుకొని సీజ్ చేసినట్లు చిన్నకోడూరు ఎస్ఐ తెలిపారు.