
మండలంలోని తొర్తి, గుమ్మిర్యాల్ గ్రామాల్లో ఎమ్మార్వో మహమ్మద్ యూసుఫ్ అతని సిబ్బందితో కలిసి అక్రమ రవాణా చేస్తున్న ఇసుకను, డంపులను పట్టుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం అర్థరాత్రి గుమ్మిర్యాల్ గ్రామంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం తెలుసుకుని,ట్రాక్టర్ ను పట్టుకుని సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ నందు అప్పగించామని అన్నారు. అలాగే బుధవారం తొర్తి గ్రామంలో పటేళ్ళపల్లి వద్ద 15 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక నిల్వలు ఉన్నాయని సమాచారం మేరకు ఇసుక డంపులను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలిపారు.