సందడికి శ్రీకాకుళం ఫోక్‌ సాంగ్‌

 to the bustle Srikakulam Folk songజీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘కోట బొమ్మాళి పిఎస్‌’. మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం ‘నాయాట్టు’కి ఇది రీమేక్‌. ఈ సినిమాకి బన్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మాతలు. శ్రీకాంత్‌ మేక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. రాహుల్‌ విజరు, శివాని రాజశేఖర్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. లేటెస్ట్‌గా ఈ చిత్ర మ్యూజిక్‌ ప్రమోషన్లను మేకర్స్‌ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈనెల 11న మాస్సీ శ్రీకాకుళం ఫోక్లోర్‌ ఫస్ట్‌ సింగిల్‌ను రిలీజ్‌ చేస్తున్నట్టు శుక్రవారం చిత్ర బృందం ప్రకటించింది. ఇంట్రెస్టింగ్‌ పోస్టర్‌తో ఈ అప్డేట్‌ అందించారు. పూర్తిస్థాయి ఫోక్‌ సాంగ్‌తో రానున్న ఈ పాట ప్రేక్షకుల్ని అలరిస్తుందని దర్శక, ర్మాతలు చెప్పారు. ‘జోహార్‌, అర్జున ఫాల్గుణ’ వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన తేజ మార్ని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: భాను ప్రతాప, రియాజ్‌ చౌదరి, డిఓపీ: జగదీష్‌ చీకాటి, డైలాగ్స్‌: నాగేంద్ర కాశి, ఎడిటర్‌: కార్తీక శ్రీనివాస్‌ ఆర్‌,
ఆర్ట్‌ డైరెక్టర్‌: గాంధీ నడికుడికర్‌, సంగీత దర్శకుడు: రంజిన్‌ రాజ్‌, మిధున్‌ ముకుందన్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అజరు గద్దె.