అవకాశం వస్తే హీరో చిరంజీవితో సినిమా చేస్తానని దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా చెప్పారు. యానిమల్ సక్సెస్‌లో భాగంగా ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్కడి సినీ ప్రియులతో సరదాగా ముచ్చటిస్తూ, తనకు చిరంజీవితో కలిసి వర్క్ చేయాలని ఉందని చెప్పారు. అవకాశం వస్తే తప్పకుండా ఆయనతో ఓ యాక్షన్ డ్రామా తెరకెక్కిస్తానని అన్నారు.