నవతెలంగాణ – వేములవాడ రూరల్
వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట క్లస్టర్ పరిధిలోని లింగంపల్లి గ్రామ రైతులకు వ్యవసాయ విస్తరణ అధికారిగా సందీప్ అందించిన సేవలు ఎంతో అమూల్యమైనవని గ్రామ తాజా మాజీ సర్పంచ్ సామ కవిత తిరుపతిరెడ్డి కొనియాడారు. గత ఏడు సంవత్సరాలుగా బాధ్యతలు నిర్వర్తించిన సందీప్ బదిలీపై వెళ్తుండడంతో మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ఘనంగా సన్మానించి సత్కరించారు. రైతులకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించి అమూల్యమైన సలహాలు, సూచనలు అందించిన సందీప్ సేవలను రైతులు అభినందించారు. అనంతరం నూతనంగా ఏఈఓ గా బదిలీపై వచ్చిన దీపికను శాలువతో సత్కరించి శుభకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.