
సత్తుపల్లి మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న సంగం వెంకట పుల్లయ్య బదిలీ ఈ నెల 19 తేదీన బదిలీ అయ్యారు. ఆయన అశ్వారావుపేట అంతర్రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రం ఎం.వి.ఐ గా బుధవారం విధుల్లో చేరారు. వీరు 2016 సంవత్సరం నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు గా కూడా కొనసాగుతున్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటుపడుతున్నారు. ఉద్యోగం చేస్తునే సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. వెంకట పుల్లయ్య ఖమ్మం జిల్లా కల్లూరు మండల వాసి కావడం గమనార్హం.