మైనార్టీ కళాశాల ప్రిన్సిపాల్ గా సంగీత…

నవతెలంగాణ – అశ్వారావుపేట
టి.ఎం.ఆర్.ఇ.ఎస్( అల్ప సంఖ్యాక వర్గాల గురుకులాల సంస్థ ) బాలికలు కళాశాల 1 ప్రిన్సిపాల్ గా టి‌.సంగీత నియమితులు అయ్యారు. ఈ మేరకు ఆమె గురువారం ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఈ కళాశాల ప్రిన్సిపాల్ విధులు నిర్వహించిన లిల్లీ శారా ఇదే సంస్థ పాఠశాలకు బదిలీ అయ్యారు. పాఠశాల హెచ్.ఎం ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వహించిన సంగీత  ఇకనుండి కళాశాలలో పాఠశాల ను పర్యవేక్షిస్తారు. విధుల్లో చేరిన సంగీత ను  కళాశాలలో అధ్యాపక,ఇతర సిబ్బంది అభినందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండేళ్ళుగా మైనార్టీ పాఠశాలలో పదోతరగతి ఫలితాలలో వందశాతం ఫలితాలు సాధిస్తు వస్తున్నామని జూనియర్ కళాశాలలో కూడా వంద శాతం ఫలితాలు సాధించే విధంగా తోటి సిబ్బందితో కలసి పనిచేస్తామని అన్నారు. వీరిని అభినందించిన వారిలో కళాశాల అధ్యాపక,అధ్యాపకేతర సిబ్బంది ఉన్నారు.