
నవతెలంగాణ – బెజ్జంకి
విద్యార్థుల ప్రవేశాలకు అయా దృవీకరణ పత్రాలందజేసే సమయంలో రెవెన్యూశాఖ సిబ్బంది సమయపాలన పాటించడం లేదంటూ ఏఐఎస్ఏఫ్ జిల్లాధ్యక్షుడు సంగెం మధు అసహనం వ్యక్తం చేశారు. సోమవారం తహసిల్ కార్యలయాన్ని ఏఐఎస్ఏఫ్ నాయకులు సందర్శించి సిబ్బంది సమయపాలనను పరిశీలించారు. ఉదయం10.50 ని.దాటినా సిబ్బంది హజరవ్వలేదని మధు వాపోయారు. మండలంలోని రెవెన్యూ సిబ్బంది సమయపాలన పాటించక ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆర్డీఓ తక్షణమే శాఖపరమైన చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో ఏఐఎస్ఏఫ్ అధ్వర్యంలో జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేస్తామని మధు హెచ్చరించారు.దొంతరవేణి మహేశ్, చరణ్ పాల్గొన్నారు.