– అధికారులకు మొరపెట్టుకున్న ఫలితం శూన్యం – స్థానికులు
నవతెలంగాణ – రాయపర్తి
గ్రామపంచాయతీకి చెలించాల్సిన టాక్సీలు (పన్నులు) సమయాన్నికూలంగా చెల్లించినప్పటికీ రాయపర్తి గ్రామపంచాయతీ అధికారులు మాత్రం తమ బజారు (కాలనీ)లో పారిశుధ్యం గురించి పట్టించుకోవడంలేదని విశ్వబ్రాహ్మణ (ఓడ్ల బజార్) ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే… రాయపర్తి నడి ఒడ్డున (6వ నెంబర్ వీధి) ఓడ్ల బజార్ ఉంటుంది. వీధిలో సుమారు 50 కుటుంబాలు కులవృత్తి చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వీరికి ప్రధాన సమస్య ఈ బజారులో గ్రామపంచాయతీ సిబ్బంది చెత్తను శుభ్రం చేసిన పాపాన పోవడం లేదు.. ఈ సమస్య కొన్ని ఏండ్లుగా ఉన్నప్పటికీ అధికారులు సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నారు. చెత్త కుప్పలుగా పేరుకుపోయినప్పటికీ డంపింగ్ యార్డుకు తరలించకపోవడంతో కురుస్తున్న వర్షాల ప్రభావంతో ముక్కుపుటాలు అదిరేలా దుర్గంధం వెదజల్లుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈగలు, దోమలతో అనారోగ్యాల పాలవుతున్నామని బాధపడుతున్నారు. ఎన్నిసార్లు గ్రామపంచాయతీ వారికి మొరపెట్టుకున్న పట్టించుకోవడంలేదని తెలుపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పేరుకుపోయిన చెత్తను తరలించి చెత్త కుండీలు ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు.