జాతరలో పారిశుధ్యం మెరుగుకు అత్యంత ప్రాధాన్యత 

– స్వచ్ఛ పర్యవేక్షణ స్థలాలుగా మారిన మేడారం పరిసర ప్రాంతాలు
నవతెలంగాణ – తాడ్వాయి 
ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి ప్రత్యేక చొరవతో జిల్లా పంచాయతీ విభాగం ద్వారా జాతరలో పారిశుధ్యం మెరుగుకు అత్యంత ప్రాధాన్యత కల్పించారు. ఆలయ ప్రాంగణంతో పాటు భక్తులు దర్శనానికి వెళ్లే సెక్టార్లు, 4 వేలమంది పారిశుద్ధ్య కార్మికులను  నియమించి పరిశుభ్రంగా ఉంచుతూ మేడారం పరిసరాలు స్వచ్ఛ పర్యవేక్షణ స్థలాలుగా తీర్చిదిద్దుతున్నారు. వీడికి భక్తులే ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నారు మంగళవారం మేడారం శ్రీ సమ్మక్క… సారాలమ్మ మహజాతర  అమ్మవార్లను దర్శించుకునే ఆలయ ప్రాంగణం ముందు భాగంలో  పారిశుధ్యం కార్మికులు పరిశుభ్రం చేయడం ఛాయాచిత్రం ద్వారాబంధించడం జరిగింది. ప్రజాప్రతినిధులు, అతిధులు ఎక్కువగా సందర్శించే ప్రాంతం కావడం అధికారులు నిరంతరం పర్యవేక్షించి పారిశుధ్యంపై చర్యలు చేపట్టడం హర్షించదగ్గ విషయం.