నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలో మల్లారం గ్రామంలోని 8వ వార్డులో పారిశుధ్య పనులకు చర్యలు చేపట్టాలని ఆవార్డు ప్రజలు మెట్టు మల్లేష్, పల్నాటి శేఖర్, దేనవేన నర్సయ్య, కుసుమ రాజమల్లు, కనకయ్య, జంపయ్య, కన్నెవేమ లక్ష్మన, స్వామి, సమ్మయ్య, వేణు, ఐలయ్య తదితరులు శుక్రవారం పంచాయతీ కార్యదర్శి రాజుకు పంచాయతీ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వార్డు వాసులు మాట్లాడారు. వానాకాలంలో కావడంతో డ్రైనేజీల్లో చెత్త, చెదారంతో నికేడిపోయి మురుగు నీరు ఇళ్లలోకి చేరుతొందని వాపోయారు. చెత్త, చెదరంతో పాములు, తేళ్లు, రోడ్లపై మురుగు నీరు ప్రవహించడంతో దోమలు, ఈగలు బెడద ఎక్కువై సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వార్డులో చెత్తా, చెదారం తొలగించి, రోడ్లను శుభ్రం చేస్తూ..సీజనల్ వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లాలని కోరారు.