పారిశుద్ధ కార్మికులు ఆరోగ్యంగా ఉండాలి..

Sanitation workers should be healthy.– మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
పారిశుద్ధ కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే పట్టణం పరిశుభ్రతగా ఉంటుందని హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత అన్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో  పారిశుద్ధ్య కార్మికులకు మమత కంటి హాస్పిటల్  ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులందరూ హెల్త్ క్యాంప్ నిర్వహించినప్పుడు ఉపయోగించుకోవాలని సూచించారు.  ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి అయినా హెల్త్ చెకప్ చేసుకోవాలని తెలిపారు.  ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు బొజ్జ హరీష్ , సుప్రజ నవీన్ రావు , సానిటరీ ఇన్స్పెక్టర్ బాల ఎల్లం , వైద్యాధికారులు డాక్టర్ మమత రెడ్డి , శ్రీకాంత్ అరుణ్, సాయి, భాస్కర్ గౌడ్, జవాన్లు సారయ్య, ప్రభాకర్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.