నవతెలంగాణ- రాయపోల్; తన పేదరికం సైతం లెక్కచేయకుండా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో నిరుపేద దళిత సామాజిక వర్గానికి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలి కొడుకు దేశ సేవ చేయడానికి ఆర్మీకి ఎంపిక కావడం ఎంతో గర్వకారణమని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. బుధవారం దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లి గ్రామంలో ఆర్మీకి ఎంపికైన గవ్వల పల్లి రమేష్, వారి తల్లిని ఎస్ఆర్ ఫౌండేషన్ తరపున సన్మానించి, బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల మతలు, పేద ధనిక తేడ లేకుండ చదువుకుంటే సమాజంలో ఉన్నత విలువ, గొప్ప స్థాయికి ఎదగవచ్చని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధంగా గవ్వల రమేష్ తాను దళిత సామాజిక వర్గం పేద కుటుంబంలో జన్మించినప్పటికీ తన పేదరికాన్ని,నాన్న మరణాన్ని జయించి ఆర్మీ ఉద్యోగం సాధించడం ఎంతో గర్వకారణమన్నారు.రమేష్ తల్లి ఎల్లవ్వ కోనాయిపల్లి గ్రామంలో పారిశుద్ధ్య కార్మికురాలుగా గ్రామానికి సేవ చేస్తే కొడుకు దేశానికి సేవ చేయడానికి భారత సైనికుడిగా ఎంపిక కావడం హార్శించదగ్గ విషయమన్నారు. రమేష్ పదవ తరగతి వరకు రామాయంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్ దౌల్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యాభ్యాసం కొనసాగించాడు. తన విద్యాభ్యాసం మొత్తం ప్రభుత్వ విద్యాసంస్థల లోని కొనసాగించాడు, డిగ్రీ చదువుతున్న కాలంలోనే ఎన్సీసీలో చేరి కానిస్టేబుల్, ఎస్సై, ఆర్మీ పరీక్షలకు సిద్ధమై య్యాడు. ఇటీవల వచ్చిన ఫలితాలలో భారత సైనికుడిగా ఎంపికయ్యాడు. రమేష్ దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లి గ్రామం నుండి దేశ సేవకు వెళ్లడం ఎంతో గర్వకానమని, అలాంటి వ్యక్తికి జన్మనిచ్చిన తల్లి ఎల్లవ్వకు ఋణపడి ఉంటామన్నారు. రమేష్ ను ఆదర్శంగా తీసుకొని యువత దేశ సేవకు ముందుకు రావాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి పుట్ట రాజు, కోశాధికారి మహమ్మద్ ఉమర్, గ్రామ యువకులు శ్రీనివాస్,స్వామి,కనకరాజు, మహేష్,అశోక్,ప్రవీణ్,రవి,రాజు,స్వామి తదితరులు పాల్గొన్నారు.