కాటాపూర్ లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

నవతెలంగాణ -తాడ్వాయి 
  మండలంలోని కాటాపూర్ గ్రామంలో ముమ్మరంగా పారిశుధ్య పనులను నిర్వహిస్తున్నారు. ముసురు వర్షాలు కురుస్తున్నందున, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక సర్పంచ్ పుల్లూరు గౌరమ్మ దగ్గర ఉండి పంచాయతీ కార్యదర్శి కోరం భాగ్యరాణి ఆధ్వర్యంలో గ్రామంలోని వీధి వీధి గుండా మురుగు నీటి కాలువలను మరియు ప్రధాన వీధులను పారిశుధ్య కార్మికుల తో వెంట ఉండి పనులు నిర్వహిస్తున్నారు. కాలువలో మరియు నీరు నీల్వ ఉండే ప్రదేశాల్లో బ్లీచింగ్ పౌడర్ను చల్లి దోమలు వ్యాప్తి చెందకుండా అరికడుతున్నారు. అనంతరం ప్రధాన వీధులలో హైపోధ్రావణాన్ని పిచికారి చేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ గౌరమ్మ మాట్లాడుతూ ప్రజలు తమ చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ప్రభుత్వం అందజేసిన తడి చెత్త మరియు పొడి చెత్త డస్ట్ బిన్లను వాడి పర్యావరణం కలుషితం కాకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని తెలియజేశారు.