నిరంతరం పారిశుధ్య పనులు కొనసాగాలి

నిరంతరం పారిశుధ్య పనులు కొనసాగాలి– జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు
నవతెలంగాణ-జైపూర్‌
గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య పనులు నిరంతరం కొనసాగాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌ రావు ఆదేశించారు. శనివారం కుందారం గ్రామాన్ని సంధర్శించిన ఆయన గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టిన పారిశుధ్య పనులు పరిశీలించారు. ఇంటింట తడిపొడి చెత్త సేకరించి గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ ద్వార సెగ్రిగేషన్‌ షెడ్డుకు తరలించాలని సూచించారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఎక్కడ కూడా ప్లాస్టిక్‌ వ్యర్థాలు కనపడకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. కంపోస్టు తయారి విధానం, కంపోస్టు ఎరువు వినియోగంపై పలు సూచనలు చేసిన ఆయన నర్సరీ మొక్కలకు ప్రతి రోజు నీరు అందించాలని తెలిపారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు. ముబైల్‌ యాప్‌ ఇన్స్‌పెక్షన్‌లో భాగంగా మండలంలోని ఎల్కంటి గ్రామాన్ని సంధర్శించిన జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌ రావు గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుధ్య పనుల తీరును పరిశీలించారు. వర్షాకాలంలో ఎక్కడ కూడా వర్షపు నీరు నిలువకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపు, గ్రామ పంచాయతీ కార్యదర్శి విష్ణువర్థన్‌ పాల్గొన్నారు.